MDCL: కూకట్పల్లి నల్లచెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. చెరువు పక్కనే షటిల్ కోర్టు లాంటివి తదితర స్పోర్ట్స్ సదుపాయాలు కల్పించాలని స్థానికుల కోరికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో స్పందించారు. నూతన మున్సిపల్ కమిషనర్ వెంటనే స్థానికులతో మాట్లాడి, స్థలం చూసి అన్ని ఏర్పాట్లు చేయాలని, నిధులు అందిస్తామని ఆదేశాలు వేదికపైనే జారీ చేశారు.