MDK: చేగుంట మండలం జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపూర్ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు వి.లతాంబర రావు తన శరీరాన్ని దానం చేశారు. వైద్య విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తన శరీరాన్ని దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న ఉపాధ్యాయుడు లతాంబర రావును ఉపాధ్యాయులందరూ అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవకే తన జీవితం అని తెలియజేశారు.