SRPT: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేట మున్సిపాలిటీలోని 30వ వార్డులో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మొరిశెట్టి నివేదితతో కలిసి ఆయన శ్రమదానం చేశారు. మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించి వ్యాధుల రహిత పట్టణంగా మార్చాలని పిలుపునిచ్చారు.