అమెజాన్ (Amazon) రెండోదశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు మెమో పంపించారు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) మరోసారి లేఆఫ్స్ కు సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం భయంతో ఇప్పటికే సుమారు 18వేలకు పైగా ఉద్యోగులను వదిలించుకున్న అమెజాన్ ఇండియా(India)లో వివిధ విభాగాల్లో పని చేస్తోన్న ఉద్యోగుల్లో 500మందిని తీసివేసే అవకాశం ఉందని అమెజాన్ తాజాగా వెల్లడించింది. రెండో విడత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మార్చి నెలలోనే ప్రకటించిన కంపెనీ సీఈవో యాండీ జెస్సీ(CEO Andy Jesse).. ప్రపంచ వ్యాప్తంగా 9వేల మందిని తొలగిస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశం ఉండడంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు యాండీ స్పష్టం చేశారు. వచ్చే నెలలో ఈ తొలగింపు ప్రక్రియ చేపడతామని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులకు చేరవేస్తామని చెప్పారు.
వీరిలో వెబ్ సర్వీసెస్(Web Services), హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉండవచ్చని కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించారు. అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 9,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్లు ఇప్పటికే అమెజాన్ ప్రకటన చేయగా అందులో భాగంగా తాజాగా భారత్ లో 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.మాంద్యం పరిస్థితుల కారణంగా పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉద్యోగుల నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. చాలా కంపెనీలు వ్యయాలను నియంత్రించుకునే మార్గంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. మెటా, గూగుల్(Google), మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇదే బాటులో పయనిస్తున్నాయి.