VZM: డెంకాడ మండలం మోదవలసలో ఆవాల అప్పన్న ఇంటిని పెట్రోల్ పోసి తగులబెట్టారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేశారు. ఘటనలో ఇంటి వస్తువులతో పాటు సుమారు రూ.2 లక్షల నగదు కాలిపోయిందని ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. ఘటన స్థలాన్ని DSP గోవిందరావు శనివారం పరిశీలించారు.