Actress kavitha: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నటి..ఆమె జీవితంలో విషాదాలెన్నో!
సినిమా ఇండస్ట్రీలో నటి కవిత.. తల్లిగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఆమె చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు.
‘సిరిసిరిమువ్వ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కవిత(Actress Kavitha). ఆ సినిమాకు ముందు ఆమె బాలనటిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 350కి పైగా సినిమాల్లో ఆమె నటించారు. 20 ఏళ్ల వయసులో వ్యాపారవేత్త దశరథరాజ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినీ ఇండస్ట్రీకి (Cine Industry) దూరంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆమె తల్లిగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కవిత భర్త కొన్ని వందల కోట్లకు అధిపతి. అయితే ఒకానొక సమయంలో ఆయనకు వ్యాపారంలో నష్టం వచ్చింది. భర్త, కొడుకు మరణించడంతో చాలా సార్లు ఆత్మహత్య(Suicide) చేసుకోవాలనుకున్నట్లు నటి కవిత తెలిపారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలోని విషాదాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు.
నటి కవిత (Actress Kavitha) మాట్లాడుతూ.. చిన్నవయసులోనే తనకు పెళ్లి జరగడంతో సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందన్నారు. అప్పటికే తన చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నప్పటికీ వాటిని కంప్లీట్ చేసి సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లు తెలిపారు. తమకు 11 దేశాల్లో ఆయిల్ బిజినెస్లు ఉండేవని తెలిపారు. తనను తన భర్త ఓ రాణిలాగా చూసుకున్నారని, అయితే తనకు వ్యాపారంలో తీవ్ర నష్టం రావడంతో సుమారు రూ.132 కోట్లను పోగొట్టుకున్నట్లు తెలిపారు.
తన భర్త అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని, ఆ టైంలోనే తీవ్ర ఒత్తిడితో చనిపోయారని నటి కవిత(Actress Kavitha) తెలిపారు. తన భర్త, కుమారుడు అదే సమయంలో చనిపోవడంతో ఆ బాధను తట్టుకోలేకపోయానని, చాలా సార్లు ఆత్మహత్య(Suicide) చేసుకోవాలనుకున్నానని చెప్పారు. అయితే తన కూతుళ్లను చూసి తన నిర్ణయం మార్చుకున్నానని, ఆ బాధ నుంచి బయటపడేందుకు మళ్లీ సినిమా(Movies)ల్లో బిజీ అయినట్లు కవిత తెలిపారు.