SRCL: ఇల్లంతకుంట మండలంలోని వెల్జీపురంలో ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ భూమిపూజ చేశారు. ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కంకణాల శ్రావణి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.