ADB: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతిని విజయవంతం చేయాలని ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు సొన్కంబ్లె జితేందర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ భవనంలో ఆదివారం అసోసియేషన్ సభ్యులు, గ్రామస్థులతో కలిసి జయంతి ఉత్సవాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.