NLG: హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 14 నుంచి 15 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.