BDK: జిల్లా నూతన కలెక్టర్ అంకిత్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు దేవస్థాన అధికారులు, వేద పండితులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి దర్శనం, ఆశీస్సులు పొందారు. అనంతరం రాబోయే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.