MDK: అల్లాదుర్గం మండలంలోని అప్పాజీ పల్లి తండాకు చెందిన వడిత్య అనిల్ (25) గిద్దమ్మ చెరువులో అనుమానస్పదంగా మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.