BDK: ఇల్లందు మున్సిపాలటి 10వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే కనకయ్య హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.