రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టితో ప్రణాళికతో అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర@ 2047” లక్ష్యాలను ప్రజలకు ముందుకు విస్తృతంగా చేరవేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. దీనిపై రూపొందించిన ప్రత్యేక క్యాలెండర్ను శనివారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకొని 2047 నాటికి సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.