ATP: జిల్లాలో రబీ 2025-26 సీజన్ ఈ-పంట నమోదు ప్రక్రియ వంద శాతం పూర్తయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రవి తెలిపారు. మొత్తం 5,91,938 సర్వే నంబర్లకు సంబంధించి వివరాలను నమోదు చేశారని వివరించారు. సామాజిక తనిఖీ కోసం ఈ ముసాయిదా జాబితాలను ఈనెల 9 నుంచి 14 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు.