అన్నమయ్య: మదనపల్లె టౌన్ రిటైల్ వస్త్ర రంగంలో పేరుగాంచిన SR షాపింగ్ మాల్ తన 15వ బ్రాంచ్‌ను మదనపల్లె పట్టణంలోని CTM రోడ్లో మార్చి 8న ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రముఖ సినీనటి మీనాక్షి చౌదరి కూడా కార్యక్రమానికి విచ్చేయనుందని సంస్థవారు తెలియజేశారు.