NGKL: అచ్చంపేట పట్టణంలోని ఒకటో వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మురళితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వార్డుల సామాగ్రాభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు.