GDWL: జిల్లాలో 14 ఏళ్ల బాలికలందరికీ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని DMHO సంధ్య కిరణ్మయి తెలిపారు. జిల్లా ఆసుపత్రి, అలంపూర్ క్రాస్ రోడ్ వంద పడకల ఆసుపత్రి, అలంపూర్ సీహెచ్సీలలో ఈ వ్యాక్సిన్ పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని ఆమె శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.