KMM: వైరా మండల పరిధిలోని తాటిపూడి పంచాయతీ జింకలగూడెంలో లబ్ధిదారుడు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలందరికీ సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.