PLD: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తుది ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. డిప్యూటీ ఎంపీడీవోలు ఎన్నికల సంఘం పోర్టల్లో వివరాలను వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు. జాబితా తయారీలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.