PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఇవాళ జిల్లా కేంద్రానికి రానున్నారని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి శ్యామల శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక MPDO కార్యాలయ సమావేశ మందిరంలో అందుబాటులో ఉంటారని, వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని ఆమె తెలిపారు.