GNTR: గుంటూరులో కృష్ణా నది నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు వార్డు సచివాలయ సెక్రటరీలు, ఏఈలు ప్రతిరోజూ 10 శాంపిల్స్ సేకరించి రిజిస్టర్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)పై శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.