ELR: జిల్లాలో గతేడాది ఏప్రిల్ 7న ఏలూరు రూరల్ పరిధిలో ఈ అమానుష ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆర్ఎంపీ ఎల్లా రత్నప్రసాద్కు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది.