CM KCR : మంత్రి నిరంజన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం ?
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్(CM KCR) వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, తెలంగాణ భవనల్ లో ఇవాళ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీతో పాటు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పార్లమెంటు ఎన్నికలు సహా పలు అంశాలపై తమ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై సీఎం కేసీఆర్ (CM KCR) ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిన పోయే వాళ్లు రాళ్లు వేస్తే స్పందిస్తారా. నీకు ఏం పని లేదా , తలకాయలేని వాళ్లు ఎన్నో మాట్లాడుతారని.. అలాంటి వాళ్లు విమర్శలు చేశారని కౌంటర్‌గా ప్రెస్ మీట్ పెడతారా కేసీఆర్ సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీ పని నువ్వు చేసుకోవాలని.. ఎవరి మీద ఎవరు మాట్లాడిన పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రికి సూచించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే, ఇటీవల బీజేపీ (BJP) నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మధ్య మాటల యుద్ధం నడిచింది. మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలో భారీగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించగా.. దానికి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రఘునందన్ రావుకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య విమర్శలు, సవాళ్ల పర్వం నడిచింది. ఈ ఇష్యూ వల్లే తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం