NGKL: పోక్సో కేసులో ఓ నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. NGKL లోని శ్రీపురం రోడ్డు సంజయ్ నగర్ కాలనీకి చెందిన సుజిత్ (గణేశ్) (21)పై 2024లో కైమ్ నంబర్ 294 పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా స్పెషల్ జడ్జి నసీం సుల్తానా నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ. 20 వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.