BDK: చండ్రుగొండలో గురువారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న 2లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఇరు క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు డ్రైవర్లు స్టీరింగ్ సీట్ల మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులు క్యాబిన్ల నుంచి డ్రైవర్లను బయటకు తీసి చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.