కర్నూలు: సోమవారం రాజు విహార్ సెంటర్లో జిల్లా టౌన్ DSP బాబు ప్రసాద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లైసెన్స్‌లపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 30 మంది వాహనదారులకు జరిమానాలు విధించామన్నారు.