పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు సంవత్సరాల బాలుడు బొజ్జ అభిరాం, పొరుగింటి బల్ల కుమార్ ఇంటి వద్ద ఆడుకుంటూ.. మెట్ల కింద ఉన్న ఎర్త్ వైరుకు చేయి తగలడంతో కరెంట్ షాక్తో మృతి చెందాడు. బాలుడి తండ్రి బొజ్జ సంపత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.