KRNL: చిప్పగిరి మండలంలో వికలాంగుల సదరం సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన స్టార్ట్ బుకింగ్ ఈ నెల 25వ తేదీ నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభంకానుందని MPDO అల్లా బకాష్ తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సంబంధిత ధ్రువపత్రాలతో సచివాలయాలను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రజలకు సులభంగా సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.