GDWL: జిల్లాలో స్త్రీనిధి రుణాల రికవరీ ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కలెక్టర్ రిజ్వాన్ బాషా అసహనం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,119 సంఘాలకు చెందిన 8,283 మంది సభ్యులు రూ.10.88 కోట్ల బకాయిలు ఉన్నారని తెలిపారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.