ELR: చింతలపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రగడవరం గ్రామంలో కొనకళ్ల జయమ్మ, కాగిత నాగేశ్వరరావు అక్రమ మద్యం కలిగి ఉండటంతో వారిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితులను 129 బీఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం బైండోవర్ చేసినట్లు తెలిపారు.