WGL: గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలోని పాఠశాల సమీపంలో గుట్కాలను విక్రయిస్తున్న బొల్లం భిక్షపతిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు భిక్షపతి ఇంటిపై దాడి చేసి రూ.12,190 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు.