AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు APSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. విద్యార్థులు బస్సుల్లో కండక్టర్‌కు కేవలం తమ ఎగ్జామ్ హాల్ టికెట్ చూపిస్తే చాలని, ప్రయాణానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.