KRNL: కర్నూలు జిల్లాలో విద్యా శాఖలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన సేన సమితి డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర ఆధ్వర్యంలో డీఈవో సుధాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల భవనాల మరమ్మతులు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, తాగునీరు-మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాస్టల్ వసతుల మెరుగుదలపై చర్యలు తీసుకోవాలని కోరారు.