కృష్ణా: గుడివాడ సుందరయ్య భవన్లో సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీ రెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను అమర్చి, ఆదాని సంస్థకు వేలకోట్లు సొమ్మును దోచిపెడుతుందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల యూనిట్ కి ఉదయం ఒక రేటు, సాయంత్రానికి రేటు నిర్ణయిస్తారని దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.