BHPL: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. భూపాలపల్లి 25వ వార్డు సింగరేణి పాఠశాలను ఛైర్మన్ సందర్శించి పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌తో సమావేశమై సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.