AP: అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని లోకేష్ పేర్కొన్నారు.