పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26, 2026న విడుదల కానుంది. మార్చి 22న ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ కోసం పవన్ స్వయంగా రెండు రోజులు కేటాయించారనే వార్త సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. పవర్ స్టార్ ప్రచార బరిలోకి దిగడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.