GNTR: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. గతంలో కిలో రూ.50 వరకు పలకగా, ప్రస్తుతం తెనాలి మార్కెట్లో ధర రూ.10కి పడిపోయింది. హోల్సేల్ మార్కెట్లో కేవలం రూ.8కే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి భారీగా పెరగడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.