GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులునాయుడుపాలెంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 24న బాలికను ప్రలోభపెట్టి, బెదిరింపులకు గురిచేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకుని, వారిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.