WGL:TG నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) పరిధిలో ఇవాళ 6,441 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు TGNPDCL కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.