HYD: జలమండలి అన్ని కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జేఎండీ మయాంక్ మిట్టల్‌తో కలిసి ఈ- ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈయన మాట్లాడుతూ.. ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని, అలాగే పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు.