NZB: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్త చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.