ELR: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జడ్పీ హైస్కూల్లో ఇటీవల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులకు తృతీయ సోపాన్ టెస్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గురువారం జడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జి సర్టిఫికెట్లు అందజేసి వారిని అభినందించారు. స్కౌట్ అండ్ గైడ్స్‌లో చేరడం వల్ల ప్రతి విద్యార్థికి ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవడతాయన్నారు.