MLG: ఏటూరునాగారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గంట కృష్ణారెడ్డి నియామకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాలతో ఈ నియామకం చేపట్టినట్లు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్ ప్రకటించారు. నియామకానికి సహకరించిన నాయకులకు కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.