NDL: కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ కార్యకర్త దొమ్మరి వెంకటసుబ్బయ్య ఇటివల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీసీ ఇందిరా రెడ్డి గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. వెంకటసుబ్బయ్య పార్టీకి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.