TG: భద్రాద్రి కొత్తగూడెం(D) మణుగూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు పౌష్టికాహారం అందించేందుకు మెస్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచినట్లు వెల్లడించారు. మెరుగైన వసతుల కల్పనలో రాజీ పడబోమని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.