NLG: ఖాజీ రామారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను DSP శివరామిరెడ్డి, సర్పంచ్ సైదులుతో కలిసి ప్రారంభించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా మారుతాయని, ఇవి నిరంతర నిఘా ఉంచుతాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోనూ వీటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.