KMR: మద్నూర్ పద్మశాలి గల్లీలో ఇందిరమ్మ ఇల్లు గృహా ప్రవేశం కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇల్లు పేదల సొంతింటి కలను సహకారం చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్, సర్పంచ్ ఉష సంతోష్ ఉన్నారు.