కృష్ణా: పొన్నూరులోని ప్రసిద్ధ శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి ఆలయం, శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలను సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో అమర్నాథ్ తెలిపారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. భక్తులు సహకరించాలని ప్రకటనలో కోరారు.