MDCL: ఉప్పల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో యాంటీబయోటిక్స్‌ను వైద్యుల సలహా లేకుండా వాడటం ఆరోగ్యానికి ముప్పు అని డా.సౌశీల్య హెచ్చరించారు. చిన్న జ్వరం, దగ్గు వచ్చినప్పుడే స్వయంగా మందులు కొనుగోలు చేయడం వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే, పూర్తి కోర్స్ పాటిస్తేనే ప్రయోజనం ఉంటుందని సూచించారు.